సీన్ రివెర్స్...సెహ్వాగ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఆసిస్ క్రికెటర్

     Written by : smtv Desk | Tue, Feb 12, 2019, 07:26 PM

సీన్ రివెర్స్...సెహ్వాగ్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఆసిస్ క్రికెటర్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కు ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు మాథ్యూ హేడెన్ వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఆసిస్ జట్టు ఈ నెలాఖరున భారత పర్యటనకు రాబోతున్న సందర్భంగా ఓ వీడియో విడుదల చేసింది.

ఆ వీడియోలో సెహ్వాగ్ ఆసిస్ జట్టు జెర్సీని వేసుకున్న పసికూనలను ఎత్తుకుని ఉన్నాడు. అక్కడే ఈ వివాదం మొదలైంది. పూర్తి వివారాల ప్రకారం ఇటీవల స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో వీరేంద్ర సెహ్వాగ్ బేబీ సిట్టర్ అవతారం ఎత్తారు.

అందులో చిన్నారులు ఆస్ట్రేలియా జట్టు జెర్సీని వేసుకొని ఉండటం గమనార్హం. దీంతో.. దీనిపై మాథ్యూ సీరియస్ అయ్యాడు.

ప్రధానంగా ఆసీస్‌ జట్టు జెర్సీలతో యాడ్‌ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు వీరూ అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చేశాడు. వరల్డ్‌కప్‌ వంటి మెగాటోర్నీలో ఎవరు బేబీ సిట్టర్స్‌ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ఆసీస్‌ ఏమీ పసికూన కాదనే సంగతిని తెలుసుకోవాలన్నాడు.

ఈ మేరకు తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా స్పందించిన హేడెన్‌ యాడ్‌ చేసిన వీరేంద్ర సెహ్వాగ్‌ను, యాడ్‌ రూపొందించిన స్టార్‌ స్పోర్ట్స్‌లను ట్యాగ్‌ చేశాడు.





Untitled Document
Advertisements