నలుగురిలో ప్రియాంక పరువు కాపాడిన నిక్...వైరల్ వీడియో

     Written by : smtv Desk | Wed, Feb 13, 2019, 03:45 PM

నలుగురిలో ప్రియాంక పరువు కాపాడిన నిక్...వైరల్ వీడియో

అమెరికా, ఫిబ్రవరి 13: బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు సంబందించిన ఓ వీడియొ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో ప్రియాంక కింద పడిపోతుండగా తన భర్త నిక్ జోనస్ కాపాడాడు. పూర్తి వివారాల ప్రకారం ప్రియాంక.. తాను నటించిన “ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్” అనే అమెరికన్ మూవీ ప్రీమియర్స్‌కు భర్తతో కలిసి వెళ్లింది.

అయితే ఈ సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిసిందీ ప్రియాంక. కారు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా పొడవాటి ఫ్రాక్ ఆమె వేసుకున్న హైహీల్స్‌లో ఇరుక్కుంది, అంతే ఒక్కసారిగా ప్రియాంక కిందపడినంద పనైంది. దీంతో వెంటనే పక్కనే ఉన్న భర్త నిక్ జోనస్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆమెను కిందపడిపోకుండా పట్టుకున్నాడు.

దీంతో చిరునవ్వులు నవ్వకుంటూ భర్తను పట్టుకొని థియేటర్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయింది ప్రియాంక.అయితే ఈ సీన్ అక్కడున్నవారు వీడియో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు, అదిప్పుడు వైరల్ అయ్యింది.


Untitled Document
Advertisements