కోహ్లీతో తనని పోల్చవద్దని కోరిన పాక్ క్రికెటర్

     Written by : smtv Desk | Wed, Feb 13, 2019, 04:07 PM

కోహ్లీతో తనని పోల్చవద్దని కోరిన పాక్ క్రికెటర్

పాకిస్తాన్, ఫిబ్రవరి 13: క్రికెట్ లో ఓ ఆటగాడు బాగా ఆడుతున్నాడంటే అతన్ని అంతకముందు సీనియర్ క్రికెటర్లతో పోల్చడం సహజం. అయితే అదే క్రమంలో పాక్ క్రికెటర్ బాబర్ ఆజంను టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చినందుకు ఆ ఆటగాడు అసహనం వ్యక్తం చేశాడు.

కాగా దీనిపై బాబర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. కోహ్లీ లాంటి గొప్ప ప్లేయర్ తో తనను పోల్చవద్దని కోరాడు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన బాబర్ ఆంజను కోహ్లీతో మిమ్మల్ని పోల్చడం పై మీ స్పందన ఏంటని మీడియా ప్రశ్నించింది. దానికి అతను స్పందించాడు. చాలా మంది నా ఆటను కోహ్లీతో పోల్చుతూ ఉంటారని అన్నాడు.

కానీ కోహ్లీ చాలా గొప్పప్లేయర్ అని తాను అతని దరిదాపుల్లో కూడా లేనని చెప్పారు. తన కెరీర్ ఇప్పుడు మొదలైందని గుర్తు చేశారు. కానీ కోహ్లీ మాత్రం ఇప్పటికే చాలా సాధించేశాడన్నాడు. భవిష్యత్తులో మాత్రం కోహ్లీలాగా రికార్డులు సాధించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.





Untitled Document
Advertisements