ఇంటర్నెట్ ప్రపంచ రాజు...100 రోజుల పిల్లాడు

     Written by : smtv Desk | Wed, Feb 13, 2019, 05:50 PM

ఇంటర్నెట్ ప్రపంచ రాజు...100 రోజుల పిల్లాడు

కాలిఫోర్నియా, ఫిబ్రవరి 13: కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ తన మేనల్లుడి ఫోటోని తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటో కాస్త ఇప్పుడు నేట్టింట్లో వైరల్ గా మారింది. పూర్తి వివారాల ప్రకారం ఓ మహిళ.. తన మేనల్లుడి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కొరియన్ సాంప్రదాయం ప్రకారం పుట్టిన బిడ్డకు 100రోజుల తర్వాత వేడుక చేస్తారు.

మనదగ్గర మొదటి పుట్టిన రోజు ఎలా గ్రాండ్ గా చేస్తారో వాళ్లు.. అలా 100వ రోజున అలా చేస్తారు. అలా చేసిన వేడుక ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయగా బాలుడి ఫోటోస్ వైరల్ అయ్యాయి.

కాగా.. ఆ బాలుడి ఫోటోలకు 4.6లక్షల లైక్ లు, వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. బాబు చాలా బాగున్నాడంటూ అందరూ ప్రశంసలుకురిపించారు. బుల్లి కింగ్ సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపించాడు. బాబు చూడటానికి చాలా ముద్దుగా ఉండటంతో.. అందరికీ తెగ నచ్చేశాడు.





Untitled Document
Advertisements