సూపర్ హిట్ కాంబో రిపీట్...!

     Written by : smtv Desk | Wed, Feb 13, 2019, 06:54 PM

సూపర్ హిట్ కాంబో రిపీట్...!

చెన్నై, ఫిబ్రవరి 13: 2003లో విలక్షణ నటుడు సూర్య, దర్శకుడు గౌతం మీనన్ కాంబినేషన్ లో వచ్చిన తమిళ్ సినిమా 'కాక్కా కాక్కా'. ఈ సినిమా తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఘర్షణ అనే టైటిల్ తో విడుదల చేశారు కాని పెద్దగా ఆడలేదు. తమిళ్ లో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సూపర్ హిట్ కు సన్నహాలు చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఇప్పుడు ఆ సినిమా సీక్వల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయట. గౌతం మీనన్ ఆల్రెడీ ఈ సీక్వల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఈ సీక్వల్ లో కూడా సూర్య నటిస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం గౌతం మీనన్ విశాల్ తో ఓ సినిమా మొదలు పెడుతున్నాడు. ఆ సినిమా తర్వాత కాక్కా కాక్కా సీక్వల్ ఉంటుందని తెలుస్తుంది.





Untitled Document
Advertisements