సంచలనం సృష్టిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 10:14 AM

సంచలనం సృష్టిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్

హైదరాబాద్, ఫిబ్రవరి 14: బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా దర్శకుడు రాంగోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అసలైన జీవిత కథ చూపిస్తానని, ఇందులో అందరి నిజస్వరూపం చూపిస్తానని వర్మ స్పష్టం చేసారు. ఇప్పటికే వర్మ విడుదల చేసిన పాటలు టీజర్ తో ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరింగింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్ పనిలో పడ్డాడు వర్మ. ఇప్పటికే ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి, చంద్రబాబు పత్రాల ఫస్ట్ లుక్ ని విడుదల చేసాడు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

అయితే ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ ను విడుదల చేస్తానని వర్మ ప్రకటించాడు. దీనికోసం పేపర్లో ఫుల్ పేజీ యాడ్స్ కూడా ఇచ్చాడు. చెప్పినట్లుగానే ఈరోజు ఉదయం 9:27 నిమిషాలకి సినిమా ట్రైలర్ ను విడుదల చేసాడు. నిజమైన ప్రేమకు ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ఐకాన్స్ అంటూ కాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. ఈ ట్రైలర్ యుట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది.





Untitled Document
Advertisements