పెళ్ళికి ముందే ప్రియుడితో ఖర్చులు పెట్టిస్తున్న హీరోయిన్

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 12:00 PM

పెళ్ళికి ముందే ప్రియుడితో ఖర్చులు పెట్టిస్తున్న హీరోయిన్

చెన్నై, ఫిబ్రవరి 14: నయనతార తమిళనాడులో అగ్ర కథానాయిక. ఆమెకు స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. ఆమె సినిమాలు ధియేటర్ల వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. అందుకే ఆమె లేడీ సూపర్ స్టార్ అయింది. అయితే ఆమె ప్రేమ విషయం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆమె దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ నుంచి ఏ కొంచెం బ్రేక్ దొరికినా ఇద్దరూ కలిసి విదేశాలకి ఎగిరిపోతున్నారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారనే టాక్ నడుస్తుంది. తను 100 సినిమాలు పూర్తి చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని నయనతార ప్రకటించింది. అయితే ఇప్పటికి ఆమె 60 సినిమాల్లో నటించింది. ఆమె 100 సినిమాలు పూర్తి చేయడానికి ఇంకా కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది. అప్పటివరకు తను పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.

అయితే ఇప్పుడు నయనతారతో ప్రేమలో ఉన్న విఘ్నేశ్ శివన్ ఆమె కోసం నిర్మాతగా మారబోతున్నాడు. ఈ సినిమాలో నయనతార ప్రధాన పాత్ర పోషించనుందని సమాచారం. మిలింద్‌ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. శివ కార్తికేయన్‌తో చేస్తున్న 'మిస్టర్‌ లోకల్‌' షూటింగ్‌ పూర్తి చేశాక విజయ్‌ సరసన కమిట్‌ అయిన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది. ఆ తర్వాత విఘ్నేశ్ శివన్ నిర్మిస్తున్న సినిమాలో నటించనుంది.





Untitled Document
Advertisements