సూర్య 'ఎన్జీకే' టీజర్ విడుదల

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 12:24 PM

సూర్య 'ఎన్జీకే' టీజర్ విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 14: తమిళ్ హీరో సూర్య తన నటనతో విబిన్నమైన కథలతో తెలుగులో కూడా చాలా మంది అభిమానులని సంపాదించుకున్నారు. ఇప్పుడు సూర్య 'ఎన్జీకే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి ఈ సినిమాలో కథానాయికలుగా నటించారు. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసారు. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్‌కి విశేష స్పంద‌న ల‌భిస్తుంది. ఈ చిత్రంలో సూర్య రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. సూర్య పాత్రకి సంబంధించి పూర్తి భిన్నమైన సన్నివేశాలను టీజర్ లో చూపించారు. ఈ సినిమా తనకు మంచి విజయాన్ని ఇస్తుందనే ఆశతో సూర్య ఉన్నాడు. అయితే ఇది సూర్యకి 36వ సినిమా. ఈ సినిమాకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.





Untitled Document
Advertisements