ముదిరిన మాటల వివాదం : నాలుగు వన్డే మ్యాచ్ లకు దూరమైన విండీస్ క్రికెటర్

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 03:25 PM

ముదిరిన మాటల వివాదం : నాలుగు వన్డే మ్యాచ్ లకు దూరమైన విండీస్ క్రికెటర్

ఇంగ్లాండ్, ఫిబ్రవరి 14: ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ జోరూట్ ను ‘గే’అంటూ వెస్టిండీస్ క్రికెటర్ షెనాన్ గాబ్రియెల్ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు కాస్త గాబ్రియెల్ కు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. ఇతనిపై ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా ఐసీసీ షెనాన్ గాబ్రియెల్ పై విచారణ చేపట్టిన అనంతరం షెనాన్ పై నాలుగు వన్డే మ్యాచ్ ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. గాబ్రియెల్ పై నాలుగు వన్డేల నిషేధం పాటు మ్యాచ్ ఫీజులో 75శాతం కోత విధించింది. తాజా ఘటన తర్వాత గాబ్రియెల్ ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు చేరాయి. దాంతో అతని మొత్తం డీమెరిట్ పాయింట్ల సంఖ్య 8కి చేరింది. ఈ పాయింట్లు ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి లేక నాలుగు వన్డేల నిషేధానికి సమానం. ఈ క్రమంలోనే గాబ్రియెల్ పై నాలుగు వన్డేల నిషేధం విధించేందుకు ఐసీసీ సిద్ధమైంది.

ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మూడో టెస్టులో భాగంగా జో రూట్- షానన్‌ గాబ్రియల్‌ మధ్య వాడివేడి మాటల యుద్ధం జరిగింది. మూడో రోజు ఆట లో జో రూట్‌-జో డెన్లీలు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో విండీస్‌ పేసర్‌ గాబ్రియల్‌ దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే జో రూట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే గాబ్రియల్‌ చేసిన వ్యాఖ్యలు మైక్‌లో స్పష్టత లేకపోయినప్పటికీ, జో రూట్‌ మాత్రం ‘గే’ అయితే తప్పేంటి అనే సమాధానం ఇవ్వడం మాత్రం రికార్డు అయ్యింది. దాంతో జో రూట్‌ను గేగా సంబోంధించడానే అభియోగాలపై ఐసీసీ విచారణ చేపట్టింది.





Untitled Document
Advertisements