రైలు ప్రయాణికులకు శుభవార్త...మరో కొత్త నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 04:42 PM

రైలు ప్రయాణికులకు శుభవార్త...మరో కొత్త నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే

బెంగళూరు, ఫిబ్రవరి 14: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా మిషన్ కార్యక్రమంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కాచిగూడ- కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఇందులో భాగంగా కాచిగూడ- కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించే వారికి ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తున్నారు. ఈ ఉచిత వైఫైతో రైలు ప్రయాణికులు సినిమాలు ఉచితంగా చూడవచ్చని చెప్పారు.

శతాబ్ది, ముంబయి రాజధాని ఎక్స్ ప్రెస్, లక్నో ఎక్స్ ప్రెస్లలో లాగా వైఫ్ ఎన్ ఫోటెయిన్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశామని దాని సహాయంతో ప్రయాణికులు వ్యక్తిగత డివైజ్ లలో ఉచితంగా నచ్చిన సినిమాలను చూడవచ్చని రైల్వేశాఖ ప్రకటించింది. ఇటీవల కాచిగూడ-కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ ప్రెస్ లోని ఐదు ఏసీ బోగీల్లో ప్రయోగాత్మకంగా ఈ ఉచిత వైఫై విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే సినిమాలు చూడటానికి మాత్రమే అవకాశం ఉందని డౌన్ లోడ్ చేసుకోవడానికి మాత్రం వీలులేదని చెబుతున్నారు. అదేవిధంగా అశ్లీల, అభ్యంతకర కంటెన్లను చూడకుండా.. వైఫైని దుర్వినియోగం చేయకుండా ఉండేలా అధికారలు చర్యలు తీసుకుంటున్నారు.





Untitled Document
Advertisements