వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రమోషన్స్ కు ఎవ్వరినీ వదలట్లేదు కదా....

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 04:53 PM

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రమోషన్స్ కు ఎవ్వరినీ వదలట్లేదు కదా....

హైదరబాద్, ఫిబ్రవరి 14: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమా నుండు ఈ రోజు ఉదయం ట్రైలర్ ను విడుదల చేశారు సినీ బృందం. కాగా ట్రైలర్ విడుదల చేసిన కొద్ది గంటల్లోనే 2 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు షూటింగ్ మొదలు కాకముందే నెలకొన్న వివాదాలతో కావాల్సినదానికంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసింది.

ఇది సరిపోదన్నట్టు సినిమాకు సంబందించిన అప్ డేట్స్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు సినిమాను జనాల నోళ్ళలో నానేట్టు చేస్తున్నాడు వర్మ, ఆయన అలా ట్వీట్ పెట్టగానే అవి వైరల్ అయ్యి సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చి పెడుతున్నాయి.

ఈ రోజు సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన వర్మ రాహుల్ గాంధీ, వైఎస్ జగన్, కేసీఆర్, కేటీఆర్ ల ఫోటోలను వాడుకొని తనదైన శైలిలో సినిమా ప్రమోషన్ మొదలు పెట్టాడు, రాహుల్, జగన్ ఇద్దరు తమ మొబైల్, లాప్ టాప్ లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చూస్తున్నట్టుగా ఎడిట్ చేసిన ఫోటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు వర్మ, అవి ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.





Untitled Document
Advertisements