'దేవ్' రివ్యూ...కార్తి, రకుల్ ల హిట్ కాంబో రిపీట్ కాలేదు

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 05:53 PM

'దేవ్' రివ్యూ...కార్తి, రకుల్ ల హిట్ కాంబో రిపీట్ కాలేదు

హైదరాబాద్, ఫిబ్రవరి 14: కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా మరోసారి నటించిన సినిమా 'దేవ్'. ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదలై ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. రజత్ రవిశంకర్ మొట్టమొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా “దేవ్”.ఇది వరకే కార్తీ మరియు రకుల్ లు జంటగా నటించిన “ఖాకీ” సినిమా రెండు భాషల్లోనూ మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేసిందా, అడ్వెంచురస్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు విజయం సాధించిందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఈ సినిమా మొదలు కావడమే ఒక మంచి అడ్వెంచురస్ షాట్ తో మొదలయ్యి సినిమా పై మొదట్లోనే మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాగే ఆ ఆసక్తి తగ్గిపోడానికి కూడా ఎక్కువ సమయం కూడా పట్టదు. తన చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ అంటే ఇష్టమున్న యువకునిగా కార్తీ మరో సారి తన అద్భుత స్టైలిష్ నటనతో మెప్పిస్తారు. అలాగే ఈ సినిమాలో ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ మరియు అడ్వెంచరస్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే సీన్ లో కనిపించే విజువల్స్ కూడా బాగుంటాయి. అలాగే హ్యారీస్ తన సంగీతంతో మరోసారి మ్యాజిక్ చేసారు. కొన్ని పాటల్లో చూపించే లొకేషన్స్ బాగుంటాయి. ఇక హీరోయిన్ రకుల్ ఈ సినిమాలో కూడా ఒక పక్క తన నటనతో పాటు గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. కాకపోతే అడ్వెంచర్ అనే అంశం తీసుకున్న దర్శకుడు ఆ అడ్వెంచర్ అనే ఆసక్తిని సినిమా మొత్తం కొనసాగించడంలో విఫలమయ్యారు. ఏ మాత్రం కొత్తదనం లేని కథనం ఈ సినిమాకి పెద్ద మైనస్ గా చెప్పవచు. ఫస్టాఫ్ ముగిసే సరికి ఈ సినిమా పెద్దగా పర్లేదు అని అనిపించినా సెకండాఫ్ కూడా పెద్దగా ఆసక్తికరంగా ఉండడకపోవడంతో కార్తీ పైన ఆశలు పెట్టుకున్న అతని అభిమానులకు మాత్రం నిరాశే మిగులుతుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని సీన్లు అయితే ప్రేక్షకుడు ముందే అంచనా వేసేస్తాడు. అందువల్ల ఈ సినిమా చూస్తున్నంతసేపు పెద్ద కొత్తదనం ఏమి కనిపించదు. అలాగే క్లైమాక్స్ ప్రేక్షకుల అంచనాలను తల కిందులు చెయ్యడం మూలాన అది ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. ఇక మొత్తంగా చూసుకుంటే కార్తీ మరియు రకుల్ ల హిట్ కాంబో మ్యాజిక్ రజత్ రవిశంకర్ దర్శకత్వంలో రిపీట్ చెయ్యలేదు. దర్శకుడు తన మొదటి సినిమా అయినప్పుడు కథా,కథనాల పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు...ఫైనల్ గా A సెంటర్ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించినా B,C సెంటర్ ప్రేక్షకులను మెప్పించడం అయితే కష్టమనే చెప్పాలి. ఈ టైం లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిపోవచ్చు.


రేటింగ్ : 2.5/5





Untitled Document
Advertisements