కంగనా బయోపిక్...హీరోలకు టెన్షన్ స్టార్ట్...

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 06:52 PM

కంగనా బయోపిక్...హీరోలకు టెన్షన్ స్టార్ట్...

ముంభై, ఫిబ్రవరి 14: 'మణికర్ణిక' సినిమాతో విజయంతో పాటు బడా బడా హీరోలతో, ప్రముఖ వ్యక్తులతో వివాదాలు కొని తెచ్చుకుంది కంగనా రనౌత్. సినిమా రిలీజ్ టైంలో దర్శకుడు క్రిష్ నటుడు సోనూ సూద్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్. సినిమాను ఎవరు ప్రమోట్ చేయట్లేదని ఆమీర్ ఖాన్ వంటి హీరోలను ఆడేసుకుంది. ఇక లేటెస్ట్ గా ఆమె తన బయోపిక్ సినిమా చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. కంగనా రనౌత్ బాలీవుడ్ లో ఖాన్ హీరోలతో పాటుగా క్రిష్ తో కూడా గొడవలు పడిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఆ హీరోయిన్ బయోపిక్ అనగానే ఆ హీరోల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ బయోపిక్ లో కంగనా ఏ విషయాలను బయట పెడుతుంది అని అందరు కంగారు పడుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశ జరుగుతున్న ఈ సినిమా అఫిషియన్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వెళ్లడిస్తారని తెలుస్తుంది.





Untitled Document
Advertisements