'ఇండియన్ 2' లో విల్లన్ గా సిద్ధార్థ్...?

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 07:32 PM

'ఇండియన్ 2' లో విల్లన్ గా సిద్ధార్థ్...?

హైదరాబాద్, ఫిబ్రవరి 14: 1996 లో సంచలన దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు కమల్ హసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'భారతీయుడు'. ఈ సినిమాకు సీక్వెల్ గా 'ఇండియన్ 2' అనే టైటిల్ తో వస్తున్న సంగతి తెలిసిందే. రెండు దశాబ్ధాల తర్వాత వస్తున్న సీక్వల్ ఇండియన్-2లో కమల్, శంకర్ తప్ప మిగతా వారంతా కొత్తవారే.

కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా సిద్ధార్థ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా సిద్ధార్థ్ కు సరైన సక్సెస్ లు లేవు.. హీరోగానే కాదు విలన్ పాత్రలకు సై అంటున్నాడు. అందుకే శంకర్ ఇండియన్-2లో సిద్ధుని విలన్ గా సెలెక్ట్ చేశాడట. శంకర్ డైరెక్ట్ చేసిన 'బాయ్స్' సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ ఇన్నాళ్లకు మళ్లీ శంకర్ డైరక్షన్ లో అది కూడా విలన్ గా టర్న్ అవడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఈమధ్యనే మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కాని కొద్దిపాటి గ్యాప్ తో యధావిధిగా షూటింగ్ జరుగుతుందట. సినిమాలో తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోశిస్తున్నాడని తెలుస్తుంది. మరి ఇండియన్-2 లో ఇన్ని హైలెట్స్ ఉండగా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.





Untitled Document
Advertisements