సమంతకు షాక్.. మరో అమ్మాయితో నాగచైతన్య లిప్ లాక్ !!!

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 07:41 PM

సమంతకు షాక్..   మరో అమ్మాయితో నాగచైతన్య లిప్ లాక్ !!!

హైదరాబాద్, ఫిబ్రవరి 14: అదేంటి.. అక్కినేని నాగ‌చైత‌న్య మ‌రో అమ్మాయికి ముద్దు పెట్ట‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు తెలుగు సినిమాల్లో లిప్ లాక్స్ అనేవి రొటీన్ అయిపోయాయి. పెళ్లైన హీరోలు కూడా లిప్ లాక్ సీన్స్ చేస్తున్నారు. అదే పెళ్లైన హీరోయిన్లు చేస్తే మాత్రం అదో పెద్ద నేరంగా చూస్తున్నారు. ఇప్పుడు చైతు కూడా మ‌రోసారి లిప్ లాక్ పెట్టేసాడు. తాజాగా విడుద‌లైన మ‌జిలీ టీజ‌ర్లో ఈయ‌న మ‌రో హీరోయిన్ దివ్యాంశా కౌశిక్ పెదాల‌ను చుంభించాడు. ఈ సినిమాలో స‌మంత లీడ్ హీరోయిన్.ఆమె ఉండ‌గానే మ‌రో హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ ప్లాన్ చేసాడు నిన్ను కోరే ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌. ఈ టీజ‌ర్ కు సూపర్ రెస్పాన్స్ వ‌స్తుంది. క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య క్రికెటర్ గా న‌టిస్తున్నాడు. మ‌రోవైపు ఎమోష‌న‌ల్ డ్రామాగా కూడా దీన్ని తెర‌కెక్కిస్తున్నాడు శివ నిర్వాణ‌. పెళ్లి త‌ర్వాత ఎన్ని సినిమాలు వ‌చ్చినా కూడా క‌లిసి న‌టించ‌డానికి స‌మంత‌, చైతూ ఒప్పుకోలేదు. కానీ మ‌జిలీతో క‌లిసారు. ఏ మాయ చేసావే, మ‌నం, ఆటోన‌గ‌ర్ సూర్య లాంటి సినిమాల త‌ర్వాత ఈ కాంబినేష‌న్లో వ‌స్తున్న సినిమా ఇది.





Untitled Document
Advertisements