త్వరలో మెగాస్టార్ చిరంజీవి బయోపిక్....?

     Written by : smtv Desk | Thu, Feb 14, 2019, 09:10 PM

త్వరలో మెగాస్టార్ చిరంజీవి బయోపిక్....?

హైదరబాద్, ఫిబ్రవరి 14: ప్రసుతం భారత సినీ పరిశ్రమలో బయోపిక్ ల హవా నడుస్తుంది. ప్రముఖ వ్యక్తుల జీవితాధారంగా సినిమాలను తెరకేక్కిస్తూ వాటిని క్యాష్ గా మార్చుకుంటున్నారు నిర్మాతలు. ఇక మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విషయానికొస్తే సంచలన నటి సావిత్రి గారి బయోపిక్ 'మహానటి' సినిమా వచ్చినప్పటినుండి ఇంకా క్రేజ్ ఎక్కువయ్యిందని చెప్పుకోవాలి.

దాని తరువాత దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర కూడా వచ్చేసింది. కానీ అక్కినేని జీవిత చరిత్ర తీయబోమని నాగార్జున ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ గారి బయోపిక్ కోసం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే కృష్ణ గారి బయోపిక్ కూడా రాబోతుంది.

తాజాగా ఈ లిస్టులోకి చేరిన పేరు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి బయోపిక్ కూడా తీయాలనే ఆలోచన వచ్చిందని సమాచారం. కానీ ఎవరు చేయాలి, ఎవరు దర్శకత్వం వహించాలి ఎలాంటి సంఘటను ఈ చిత్రంలో చూపించాలి అని ఆలోచన కూడా వస్తుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చే సమయంలో చిరంజీవి చాలా కష్టపడ్డారు.

ఒకవైపు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరోగా ఎలా ఎదిగాడు, ఆ సమయంలో చిరంజీవి ఎన్ని సమస్యలు ఎదుర్కున్నాడు, ఆ తరువాత సుడి తిరిగి మెగాస్టార్ ఎలా అయ్యాడు అనేవి చూపించనున్నారని సమాచారం. కాకపొతే దీనికి సంబందించిన వివరాలేవీ కూడా ఇంకా అధికారికంగా బయటకు రాలేదు.





Untitled Document
Advertisements