'పీఏం-కిసాన్' పథకం మొదట అమల్లోకి వచ్చేది అక్కడి నుండే

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 07:27 AM

'పీఏం-కిసాన్' పథకం మొదట అమల్లోకి వచ్చేది అక్కడి నుండే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: గత కొద్ది రోజుల క్రితం 2019-20 బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిది గురించి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు లబ్ధి చేకూర్చే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24వ తేదీన ప్రారంభించనున్నారు. మొదటగా ఈ పథకాన్ని ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించనున్నారు.

ఈ పథకం కింద 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6వేలు మూడు విడతలుగా ఇవ్వనున్నారు. తొలి విడతలో కోటి మందికి పైగా లబ్ధిదారులకు రూ.2 వేలు చొప్పున అందనున్నాయి. ఈనెల 24వ తేదీ వరకు పీఏం-కిసాన్ పోర్టల్ లో నమోదు చేసుకున్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు జమకానుంది.

రెండో విడతలో రూ. 2వేలను ఏప్రిల్‌ ఒకటో తేదీన విడుదల చేయనుంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో 95 శాతం వివరాలు, 9 రాష్ట్రాల్లో 80 శాతం రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాగా మిగతా రాష్ట్రాలు కాస్తంత వెనుకబడి ఉన్నాయని అధికారులు తెలిపారు. తొలి విడత జాబితాలో తమ పేర్లు నమోదైందీ లేనిదీ చెక్‌ చేసుకోవాలని రైతులను కోరారు.





Untitled Document
Advertisements