రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ లుక్ రిలీజ్ తేది ఖరారు; పాత్రలు లీక్

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 07:41 AM

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ లుక్ రిలీజ్ తేది ఖరారు; పాత్రలు లీక్

హైదరాబాద్, ఫిబ్రవరి 15: 'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆలియా భట్ ఈ సినిమాలో ఒక కథానాయికగా ఎంపిక అయ్యింది. మరో కథానాయిక కోసం కొందరు హీరొయిన్లను సంప్రదిస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇటీవల రామ్ చరణ్ కి సంబంధించిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిచారు. ఎన్టీఆర్ మాత్రం బందిపోటుగా కనిపించానున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాలోని పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇంతవరకు విడుదల చేయలేదు.

తమ హీరోలని రాజమౌళి ఎలా చుపించబోతున్నాడో తెలుసుకోడానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు సమాచారం. మార్చి 27న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని భావిస్తున్నారు.





Untitled Document
Advertisements