సీఆర్పీఎఫ్ జవాన్ల మృత్తి: ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 08:34 AM

సీఆర్పీఎఫ్ జవాన్ల మృత్తి: ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి

శ్రీనగర్, ఫిబ్రవరీ 15: గురువారం సాయంత్రం శ్రీనగర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో 70 వాహనాలతో వెళుతున్న సీఆర్ఫీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ దాడులు జరిపారు. ఈ దాడిలో 42 మంది జావాన్లు ప్రాణాలు కోల్పోయారు.

15 ఏళ్ల తరువాత ఇదే అతిపెద్ద దాడి అని ఆర్మీ వర్గాలు పేర్కొన్నారు. కాగా ఈ ఉగ్రదాడి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఈ దాడి హేయమైన చర్య అని మోదీ పేర్కొన్నారు. ఈ చర్య వారి పిరికితనాన్ని తెలియజేస్తుందని అన్నారు.

జవాన్ల ఆత్మత్యాగం వృథా కాదు అని, మృత్తి చెందిన వీరుల కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తుందని మోదీ ట్వీట్ చేశారు. గాయపడ్డ జవాన్లు తొందరాగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మాట్లాడినట్టు ప్రధాని వెల్లడించారు. పుల్వామాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించినట్టు తన ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు.





Untitled Document
Advertisements