జవాన్లను చంపేముందు ఉగ్రవాది వీడియో సంభాషణ

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 08:50 AM

జవాన్లను చంపేముందు ఉగ్రవాది వీడియో సంభాషణ

జమ్మూ కాశ్మీర్, ఫిబ్రవరి 15: జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాల కాన్వాయ్ పై జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ అనే ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 42 మంది జవాన్లు మరణించారు.

మరో 50మంది జవాన్లు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే, పుల్వామా దాడికి తమదే బాధ్యత అని ప్రకటించుకున్న జైషే మహ్మద్ సంస్థ ఈమేరకు దాడికి పాల్పడిన అదిల్ అహ్మద్ వీడియోను విడుదల చేసింది.

తనకు త్వరలోనే స్వేచ్చ లభిస్తుందంటూ ఆ వీడియోలో అదిల్ అహ్మద్ పేర్కొన్నాడు. ఎంతో ఉద్వేగపూరితంగా ఆ వీడియోలో అదిల్ అహ్మద్ ప్రసంగించాడు. ఈ వీడియో అందరికి చేరే సమయానికి తాను పరలోకంలో ఉంటాను. జైషే మహ్మద్ సంస్థలో ఏడాది పాటు ఉన్నా. కశ్మీర్ ప్రజలకు ఇదే నా చివరి సందేశం అని ఆదిల్ అహ్మద్ ఆ వీడియోలో మాట్లాడాడు.

భారత్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న దక్షిణ కాశ్మీరీలకు మద్దతుగా ఉత్తర, మధ్య కాశ్మీర్ ప్రజానీకం కూడా కలిసి రావాలని పిలుపునిచ్చాడు అదిల్ అహ్మద్. కొందరు కమాండర్లను చంపినంత మాత్రాన జైషే బలహీనపడుతుందని భావించడం భారత్ అజ్ఞానానికి నిదర్శనం అని, అలాంటి భ్రమలను భారత్ తొలగించుకోవాలని అన్నాడు. వీడియోలో అదిల్ తన రెండు చేతుల్లో ఆటోమేటిక్ రైఫిల్స్ పట్టుకుని..బ్యాక్ డ్రాప్‌లో జైషే మహ్మద్ జెండాతో ఉన్నాడు.





Untitled Document
Advertisements