కూటమి గెలిస్తే ప్రధాని ఎవరు? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 09:17 AM

కూటమి గెలిస్తే ప్రధాని ఎవరు?  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

కొలకత్తా, ఫిబ్రవరి 15: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ నాయకులు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించాలన్న లక్ష్యంతో గట్టి వ్యూహం పన్నుతున్నారు కూటమిలోని నేతలు.

అయితే విపక్షాలన్నీ కలిసి ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, ఒకవేళ కూటమి గెలిస్తే, ప్రధాని పదవి ఎవరిదన్న విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి పదవికి రాహుల్ తో పాటు చంద్రబాబు, శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా తదితరులంతా ఉన్నారని చెప్పారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

కూటమిలోని నాయకులంతా కలిసి ఎన్నికలకు ముందే పొత్తులపై పూర్తి అవగాహన కుదుర్చుకుంటామని చెప్పారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని తెలిపారు. తమ తమ రాష్ట్రాల్లో అనుకులించాపోయిన, కేంద్రంలో మాత్రం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.

తాను కేసీఆర్ తో కూడా చర్చించమని, ఆయన కూడా కూటమిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తాను ప్రధాని పదవిని కోరుకుంటున్నట్టు వాస్తవం లేని మాటలు వినిపిస్తున్నాయని మమతా వ్యాఖ్యానించారు. తాను స్వైన్ ఫ్లూతో బాధపడుతూ ర్యాలీ చేస్తానని అమిత్ షా చెబితే, ఎలా అనుమతిస్తామని మమత ప్రశ్నించారు.





Untitled Document
Advertisements