అత్యవసర మంత్రివర్గ సమావేశం, పుల్వామా ఉగ్రదాడిపై చర్చ!

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 09:20 AM

 అత్యవసర మంత్రివర్గ సమావేశం, పుల్వామా ఉగ్రదాడిపై చర్చ!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: గురువారం సాయంత్రం పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై జరిగిన దాడి వల్ల 44 మంది జావాన్లు స్వర్గస్తులయ్యారు. ఈ ఘటనపై చర్చిందేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈరోజు అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్యాబినెట్ మీటింగ్ ఈ ఉదయం 9.30 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో పుల్వామా ఉగ్రదాడిపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జైషే మహమ్మద్ ఉగ్రసంస్థను ఇక ఏ మాత్రం ఉపేక్షించరాదని భావిస్తుంది. ఇందు కొరకు ఇతర దేశాల సాయంతో పాకిస్థాన్ పై ఒత్తిడిని పెంచే విషయంపైనా చర్చించనుంది. ఈ దాడికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న విషయంపైనా చర్చ జరుగుతుందని సమాచారం. కాగా, ఉగ్రవాదుల దాడిలో మరో 45 మందికి గాయాలు కాగా, వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.





Untitled Document
Advertisements