2 రోజులగా రోడ్లపై తిరుగుతూ హెల్మెట్ ఆవశ్యకత: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 09:47 AM

2 రోజులగా రోడ్లపై తిరుగుతూ హెల్మెట్ ఆవశ్యకత: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ

పుదుచ్చేరి, ఫిబ్రవరి 15: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ గత రెండు రోజులగా రోడ్లపై తిరుగుతూ హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై పయనిస్తున్న వారు తప్పనిసరి హెల్మెట్ పెట్టుకోవాలంటూ గట్టిగా హెచ్చరిస్తున్నారు. తాజాగా కిరణ్ బేడీ గురువారం మాట్లాడుతూ, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి భార్య ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం ఆమె స్కూటర్‌పై వెళ్తూ ప్రమాదానికి గురైందని, తలకు దెబ్బ తగలడంతో మృత్తి చెందినట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన బాధాకరమైనదేనని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేయడం, కిరణ్ బేడీ రోడ్లపై తిరుగుతూ బైకర్లకు అవగాహన కల్పించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి మండిపడ్డారు.

తాను రోడ్లపై పడి హెల్మెట్ ధరించాలని చెప్పడం నిరంకుశత్వమని ముఖ్యమంత్రి నారాయనస్వామి వ్యాఖ్యానించడాన్ని బేడీ ఎద్దేవా చేశారు.





Untitled Document
Advertisements