నాని 'జెర్సీ' ఫస్ట్ సాంగ్ విడుదల

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 09:57 AM

నాని 'జెర్సీ' ఫస్ట్ సాంగ్ విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 15: నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జెర్సీ'. ఈ చిత్రంలో నాని ఒక క్రికెటర్ పాత్రలో కనిపించానున్నడన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేస్తామని నిర్మాతలు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దాని ప్రకారం తాజాగా సినిమా నుంచి "అదేంటో గానీ" అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు.

ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. కృషకాంత్ ఈ పాటకి సాహిత్యం అందించగా అనిరుధ్ ఈ పాటకి తన స్వరాన్ని అందించాడు. మెలోడిగా సాగిపోయే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శ్రద్ధ శ్రీనాథ్ ఈ సినిమాలో నానికి జోడీగా నటించింది. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఏ సినిమా పేక్షకుల ముందుకు రానుంది.





Untitled Document
Advertisements