ఫ్లాష్ న్యూస్: గోవా మాజీ డిప్యూటీ సీఎం ఫ్రాన్సిస్ డిసౌజా మృతి

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 11:21 AM

ఫ్లాష్ న్యూస్: గోవా మాజీ డిప్యూటీ సీఎం ఫ్రాన్సిస్ డిసౌజా మృతి

పనాజి, ఫిబ్రవరి 15: భారతీయ జనత పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే, గోవా మాజీ డిప్యూటీ సీఎం ఫ్రాన్సిస్ డిసౌజా మృత్తి చెందారు. గత కొద్ది రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన స్వర్గస్తులయ్యారు. కాన్సర్ తో బాధపడుతున్న ఫ్రాన్సిస్ డిసౌజా చికిత్స నిమిత్తం అమెరికా వెళ్ళారు.

కాగా ఇటీవల ఆయన ఇండియా చేరుకున్నారు. డిసౌజా మృతిపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దక్షిణ గోవా ఎంపీ నరేంద్ర సావైకర్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి దామోదర్ నాయక్ మాట్లాడుతూ, తాము ఒక గొప్ప నాయకుడిని కోల్పయమని తెలిపారు. కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి గొప్ప నేతగా ఎదిగారని కొనియాడారు. నాయకుడంటే ఇలా ఉండాలీ అనేట్టుగా డిసౌజా ఉన్నారని, వర్ధమాన నేతలకు ఆయనో స్ఫూర్తి అని పేర్కొన్నారు.

గోవా రాజీవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1999 గెలిచిన డిసౌజా ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2002, 2007, 2012, 2017లలో మపూసా నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 2012లో బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చినప్పుడు డిసౌజా డిప్యూటీ సీఎంగా పనిచేశారు.





Untitled Document
Advertisements