పుల్వామా దాడి జరిగే అవకాశం ఉందని తెలిసిన అడ్డుకునే విషయంలో చర్యలు తీసుకోలేకపోయారా?

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 11:56 AM

పుల్వామా దాడి జరిగే అవకాశం ఉందని తెలిసిన అడ్డుకునే విషయంలో చర్యలు తీసుకోలేకపోయారా?

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: పుల్వామా జిల్లాలో జరిగిన దాడికి 44 మంది జావాన్లు మరణించారు. అయితే, ఈ దాడికి సంబంధించి భద్రత బలగాలను ఇంటలిజెన్స్‌ ముందే అప్రమత్తం చేసినట్టు సమాచారం. గత కొద్ది రోజుల క్రితం సిరియా తరహాలో కారు బాంబు దాడి జరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలకు ఇంటలిజెన్స్ ముందే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ, ఈ దాడిని అడ్డుకునే విషయంలో సరైన తీసుకోలేకపోయినట్టు చెబుతున్నారు.

భద్రతా సిబ్బంది దాడి జరగడానికి ముందు శ్రీనగర్ వైపు వెళ్తున్న కార్లను తనిఖీలు చేసినప్పటికీ, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ కారును మాత్రం వారు కనిపెట్టలేకపోయారు. వాస్తవానికి కారు బాంబు దాడిపై ఇంటలిజెన్స్ నుంచి సమాచారం వచ్చాక మిలటరీ కాన్వాయ్‌ను అర్థరాత్రి సమయంలోనే నడపాలని నిర్ఱయించినట్టు తెలుస్తోంది.

ఆ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి కాన్వాయ్ వెళ్లేవరకు రోడ్డుపై వెళ్లే మిగతా వాహనాలను నిలిపివేయడంతో పాటు వాటిని లోతుగా తనిఖీ చేసి పంపించవచ్చునని ఆర్మీ అధికారులు భావించారు. మరల ఏ కారణాల చేతనో దాన్ని ఆచరించాలేకపోయారు. గురువారం సాయంత్రం దాడి సమయంలో రోడ్ మీద వాహనాల రద్దీ ఎక్కువ ఉండటంతో బాంబు ఉన్న కారును గుర్తించలేక పోయారు.

కాగా, ఈ ఆత్మాహుతి ఘటనతో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ప్రకటించింది. భారత ప్రభుత్వం, మీడియా నుండి వస్తున్నా ఆరోపణలను ఖండించింది. విచారణ జరపకుండానే దాడి తాము చేశామని ఎలా అంటారు అంటూ పాక్ ప్రశ్నిస్తోంది అంటూ పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.





Untitled Document
Advertisements