మహేష్ బాబు మేనల్లుడిని కాదని నాగ చైతన్యని ఓకే చేసారు

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 01:09 PM

మహేష్ బాబు మేనల్లుడిని కాదని నాగ చైతన్యని ఓకే చేసారు

హైదరాబాద్, ఫిబ్రవరి 15: అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం 'మజిలీ' షూటింగ్ ముగించుకొని, 'వెంకిమామ' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన 'మజిలీ' టీజర్ కు మంచి స్పందన లభిస్తుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నాగ చైతన్య కొత్త సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తర్వాతి సినిమా దిల్ రాజు నిర్మాణంలో ఉండబోతుందని సమాచారం.

ముందుగా మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ తో ఓ సినిమా చేయాలనీ దిల్ రాజు అనుకున్నాడు. కానీ ఆ కథకి గల్లా అశోక్ కంటే నాగచైతన్య అయితేనే న్యాయం జరుగుతుందని భావించి చివరి నిమిషంలో గల్లా అశోక్ ని తప్పించి, నాగ చైతన్యతో ఆ సినిమా చేయాలనీ ఫిక్స్ అయిపోయాడు దిల్ రాజు. నాగ చైతన్య కూడా ఓకే చెప్పడంతో వీరిద్దరి సినిమా పట్టలేక్కనుంది. అయితే 'వెంకిమామ' షూటింగ్ తర్వాతే చైతూ ఈ సినిమా చేయనున్నాడు.





Untitled Document
Advertisements