'షేడ్స్ ఆఫ్ సాహో' చాప్టర్ 2 మేకింగ్ వీడియో విడుదలకు డేట్ ఫిక్స్

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 03:23 PM

'షేడ్స్ ఆఫ్ సాహో' చాప్టర్ 2 మేకింగ్ వీడియో విడుదలకు డేట్ ఫిక్స్

హైదరాబాద్. ఫిబ్రవరి 15: బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ సినిమాతో వస్తున్న సినిమా 'సాహో'. బాహుబలి రెండు సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానులు ఈ సినిమా పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అలాగే దర్శకుడు సుజీత్ కి ఇది రెండో సినిమాయే అయినా కూడా ఈ సినిమాను ఉన్నత ప్రమాణాలతో ఎక్కడా తగ్గకుండా భారీ స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్న ఒక్కదానికి ఉదాహరణగా ఆ మధ్య ప్రభాస్ పుట్టిన రోజు నాడు “షేడ్స్ ఆఫ్ సాహో” చాప్టర్ 1 అనే మేకింగ్ వీడియో ఒకటి విడుదల చేసారు. ఆ వీడియో చూస్తే ఇది మన తెలుగు సినిమాయేనా అన్న రేంజ్ లో ఒక్కొక్కరికి అనిపించింది. దానితో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర యూనిట్ నుంచి “షేడ్స్ ఆఫ్ సాహో” చాప్టర్ 2 మేకింగ్ వీడియో విడుదలకు డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వీడియోను వచ్చే నెల అంటే మార్చ్ 2 వ తేదీన విడుదల చేసందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మొదటి వీడియో తోనే ఓ రేంజ్ హైప్ తీసుకొచ్చారు, మరి ఈ వీడియో ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.





Untitled Document
Advertisements