సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు : పాకిస్తాన్

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 03:32 PM

సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి మాకు ఎటువంటి సంబంధం 
 లేదు : పాకిస్తాన్

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 15: సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఈ దాడికి తమకు ఎటువంటి సంబంధం లేదు అని ముఖం తిప్పేసింది. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సిఆర్ప్ఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై కారు బాంబు ఆత్మాహుతి దాడిలో 44 మంది మరణించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రపంచంలో ఎక్కడ హింసాత్మక సంఘటనలు జరిగినా తాము ఖండిస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు జరపకుండా దాడితో పాకిస్తాన్ కు సంబంధం ఉందని భారత ప్రభుత్వం, మీడియా మాట్లాడడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.

పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రోత్సాహం ఇవ్వడాన్ని నిలిపేయాలని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తన దేశంలోంచి పనిచేసే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయాలని కూడా డిమాండ్ చేసింది. పుల్వామాలో దాడికి పాల్పడిన జైష్ - ఎ - మొహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్ తో పాటు ఉగ్రవాదులను ఐక్య రాజ్యసమితి ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని డిమాండ్ ను సమర్థించాలని భారత్ ప్రపంచదేశాలను కోరింది.





Untitled Document
Advertisements