బ్రేకింగ్ : తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 04:00 PM

బ్రేకింగ్ : తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఎప్పటి నుండో ఆశవాహులుగా ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ వేశారు. ఈ నెల 19 న తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు కేసీఆర్.

19 న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారవ్వడంతో కొత్త ఎమ్మెల్యేలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మంత్రి వర్గ విస్తరణలో 10 మందికి మంత్రులుగా అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ నెల 19న మాఘ శుద్ధ పౌర్ణమి కావడంతో అదే రోజునే ఖాయం చేశారు ముఖ్యమంత్రి. కాగా ఆ రోజు ఉదయం 11:30 నిమిషాల నుండి మంత్రి వర్గ విస్తరణ ప్రారంభమవుతుందని ప్రకటించారు.





Untitled Document
Advertisements