లక్ష్మీస్ ఎన్టీఆర్: మోహన్ బాబుపై లక్ష్మీ పార్వతి సెన్సేషనల్ కామెంట్స్...

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 04:19 PM

లక్ష్మీస్ ఎన్టీఆర్: మోహన్ బాబుపై లక్ష్మీ పార్వతి సెన్సేషనల్ కామెంట్స్...

హైదరాబాద్, ఫిబ్రవరి 15: సీనియర్ ఎన్టీఆర్ జీవితాధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు వర్మకి తన శుభాకాంక్షలు తెలియజేసింది లక్ష్మీపార్వతి.

అంతేకాక ఈ సినిమా ద్వారా వర్మ నిజాలు చెప్పబోతున్నాడంటూ ప్రశంసలు కురిపించింది. సినిమా ట్రైలర్ లో ఓ సన్నివేశంలో మోహన్ బాబు పాత్రని కూడా చూపించారు. దీంతో మోహన్ బాబుకి సంబంధించిన ప్రశ్న లక్ష్మీపార్వతికి ఎదురుకాగా ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన సమయంలో మోహన్ బాబు కుడా ఎన్టీఆర్ ని వదిలేసి చంద్రబాబుతో కలిసిపోయాడని ఆరోపణలు చేసింది.

ఆ కారణంగానే మోహన్ బాబుని విమర్శించానని తెలిపింది. ఆ తరువాత తప్పు తెలుసుకొని అన్నగారికి అన్యాయం చేశానని క్షమాపణలు చెప్పినట్లు గుర్తుచేసుకుంది. ఆ తరువాత అతడి కామెంట్ చేయడం సరికాదని వెల్లడించింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి ఇంత రెస్పాన్స్ వస్తోందంటే జనాలు నిజంవైపు ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది.





Untitled Document
Advertisements