చరణ్ కు చిరంజీవి వార్నింగ్...మళ్ళీ అలా చెయ్యొద్దని

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 05:18 PM

చరణ్ కు చిరంజీవి వార్నింగ్...మళ్ళీ అలా చెయ్యొద్దని

హైదరాబాద్, ఫిబ్రవరి 15: మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై అసంతృప్తి చెందుతున్నాడని సమాచారం. రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాతో డిజాస్టర్ తో పాటు కొత్తగా వివాదాలను కొని తెచ్చుకున్నాడు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా 100 కోట్ల గ్రాస్ 60 కోట్ల దాకా షేర్ రాబట్టింది.

అయితే 92 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన వివి ఆర్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు రిటర్న్ గా కొంత ఎమౌంట్ అడ్జెస్ట్ చేశాడు రాం చరణ్. నిర్మాత కోరిక మేరకు 5 కోట్లు రిటర్న్ ఇచ్చాడు. ఈ విషయంలోనే బోయపాటి శ్రీనుతో నిర్మాత డివివి దానయ్య గొడవ పడ్డాడు.

అయితే ఈ సెటిల్ మెంట్ వ్యవహారం తెలిసి మెగాస్టార్ చిరంజీవి చరణ్ ను మందలించాడని తెలుస్తుంది. భారీ లాసులు వస్తే తప్ప ఇలా రిటర్న్ ఇవ్వొద్దని.. వారికి లాభాలు వచ్చినప్పుడు నిర్మాతలకు రిటర్న్ ఇవ్వరని కాస్త బ్రైన్ వాష్ చేశాడట. నిర్మాత కష్టం తెలిసిన చరణ్ తన వంతుగా సపోర్ట్ గా ఉండాలనుకున్నాడు.

అయితే వివి ఆర్ టోటల్ గా 30 కోట్లు లాస్ తెచ్చింది. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కు 3 నుండి 5 కోట్లు లాస్ అన్నమాట. మిగతా సీమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని.. అందుకే ఇంకెప్పుడు ఇలాంటివి చేయొద్దని చరణ్ కు చెప్పాడట చిరంజీవి.





Untitled Document
Advertisements