న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 15: ప్రస్తుతం ఆన్ లైన్ గేమ్ లల్లో యువతకు మతిపోగేట్టేస్తున్న గేమ్ PUBG. ఈ గేమ్ విడుదలైన కొద్ది రోజుల్లోనే మార్కెట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ గేమ్. దీంట్లో ఇప్పుడు కొత్త అప్డేట్ 0.11.0 ఫిబ్రవరి 19 నుంచి మార్కెట్ లోకి రానుంది. ఫిబ్రవరి 18న పబ్జీ సర్వర్లన్నీ మెయింటెనెన్స్ చేస్తుండటంతో కొత్తగా రానున్న జోంబీ మోడ్ ఫిబ్రవరి 19 వరకూ అందుబాటులోకి రావొచ్చన్నట్లు భావిస్తున్నారు.
ఈ విషయంపై టెన్సెంట్ గేమ్స్ ఎటువంటి నిర్దారణ ఇవ్వకపోవడంతో ఆఖరి తేదీలో ఎలాంటిమార్పులైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ జోంబీ మోడ్‌తో పాటు బీసీ టు యూసీ కరెన్సీ కన్వర్షన్ ఫీచర్‌తో పాటు మొబైల్ ప్రైమ్, ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్లు ఈ అప్డేట్ను ఆపేసే సూచనలు లేకపోలేదు. అయితే దాంతో పాటు PUBGలో G63Cగన్ కూడా అందుబాటులోకి రానుందని చెప్పుకొచ్చినా.. రాబోయే అప్డేట్లో వస్తున్న సూచనలేమీ కనిపించడం లేదు.
అప్డేట్ హైలెట్స్:
1. Sanhok మ్యాప్‌లో Tukshai
2. Erangel మ్యాప్‌లో మంచు వాతావరణం
3. Miramar, Erangel మ్యాప్‌లలో కొత్త వాతావరణం.
4. గేమ్‌లో ఎలా చచ్చిపోయామో రిప్లే చేసి చూపించడానికి న్యూ డెత్ కెమెరా
5. జోంబీ మోడ్
6. ఎమ్కే 47 మ్యూటెంట్ రైఫిల్
7. వెపన్లలో లేజర్ సైట్
8. Vikendi ఏరియాలో Snow bike
9. గేమ్ వెనుక వచ్చే గొంతులలో క్లాజిక్నెస్
10. బీటా వర్షన్లలో PUBG Vikendi snow map తీసేస్తున్నారు.