చరిత్ర సృష్టించిన హనుమవిహారీ...సెంచరీలతో రికార్డులు బద్దలు

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 05:53 PM

చరిత్ర సృష్టించిన హనుమవిహారీ...సెంచరీలతో రికార్డులు బద్దలు

నాగ్‌పూర్‌, ఫిబ్రవరి 15: ఇరానీ కప్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత బ్యాట్స్‌మన్ హనుమవిహారీ తాజాగా సెంచరీలతో కొత్త రికార్డు సృష్టించాడు. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హనుమవిహారీ అద్వితీయమైన ప్రదర్శన చేసి చరిత్ర తిరగరాశాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌ లంచ్ విరామానికి ముందు ఇరానీ కప్‌లో మూడో సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.

రెస్ట్ ఆఫ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు నమోదు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 183పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్ లలోనూ జట్టు మొత్తం చేసింది 755 పరుగులు అయితే వాటిలో విహారీ ఒక్కడే 297 పరుగులు చేయగలిగాడు. గతేడాది విదర్భ జట్టుతో జరిగిన మ్యాచ్‌ ఆఖరి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగాడు.

2011లో ప్రతి ఇన్నింగ్స్‌లో సెంచరీలు నమోదు చేసిన శిఖర్ ధావన్ తర్వాత మళ్లీ అలాంటి ఫీట్ సాధించింది హనుమవిహారీనే. ధావన్ ఈ ఫీట్‌ను రాజస్థాన్ వేదికగా రంజీ ట్రోఫీ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కనబరిచాడు. ఈ ఘనతను స్వయంగా బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసి సత్కరించింది.





Untitled Document
Advertisements