7 రోజుల నుండి వరుసగా నష్టాల్లో ముగుస్తున్న స్టాక్‌ మార్కెట్లు....!

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 06:01 PM

7 రోజుల నుండి వరుసగా నష్టాల్లో ముగుస్తున్న స్టాక్‌ మార్కెట్లు....!

ముంబయి, ఫిబ్రవరి 15: నేటికి వరుసగా ఏడు రోజులు మార్కెట్లు దిగువస్థాయిలోనే ట్రేడింగ్ ‌ముగించాయి. కాగా నిఫ్టీ 10,700 పాయింట్లవద్దనే కొనసాగిస్తూ ఉంది. సెన్సెక్స్‌ అనిశ్చితితో ఉన్న ట్రేడింగ్‌ కారనంగా వరుసగా 17వ రోజు కూడా నష్టాల్లో ఉంది. బెంచ్‌మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ 67 పాయింట్ల దిగువన 35,808 పాయింట్లవద్ద ట్రేడింగ్‌ ముగించింది.

బెంచ్‌మార్క్‌ నిఫ్టీ కూడా 0.20శాతం దిగువన 10,724 పాయింట్లవద్ద క్షీణించింది. దేశీయ ఆర్ధికఫలితాలు ఆశించినస్థాయిలో లేకపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌ధోరణులు నీరసించడమే ఇందుకుకీలకం. డా.రెడ్డిల్యాబ్స్‌ షేర్లునాలుగుశాతం దిగజారాయి. 30శాతం మేర రికవరీ అయ్యాయి. 11 ఎఫ్‌డిఎ పరిశీలనలు ఫారమ్‌ 483 బాచుపల్లియూనిట్‌పైనా విడుదకావడమే ఇందుకుకీలకం, హైదరాబాద్‌కేంద్రంగా ఉన్న ఈ ప్లాంట్‌ అమెరికా ఎఫ్‌డిఎ పరిశీలనలో ఉంది. ఫార్మాస్టాక్స్‌పై కూడా ఈప్రభావం చూపించింది.

నిఫ్టీ ఫార్మా సూచీ 3శాతం దిగజారితే మరో ఫార్మాస్టాక్‌ సన్‌ఫార్మా 4శాతం చొప్పున క్షీణించింది. ఇతర సెన్సెక్స్‌ స్టాక్స్‌లో రిలయన్స్‌ 1.5శాతం పెరిగింది ఒఎన్‌జిసి 2.5శాతం పెరిగింది. వీటికారణంగానే కొంత నష్టాలకు కట్టడి జరిగింది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం,అమెరికాచైనాలమధ్య చర్చలపై ఆసక్తి ఎక్కువ చూపించడం కూడా మార్కెట్లనష్టాలకు కారణం అయ్యింది.

రెండుదేశాలు వారి వాణిజ్యవివాదాలను పరిష్కరించుకునేదిశగా ఉన్నాయి. అమెరికా రిటైల్‌అమ్మకాలు 1.2శాతం దిగజారాయి. గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేర్లు 7శాతం క్షీణించి 562.25కి చేరాయి. ఇంట్రాడేలోనే డా. రెడ్డిస్‌షేర్లు 30 శాతానికి పైగా దిగజారాయి. తర్వాత 7.5 శాతంకు చేరి 2470.85కి ట్రేడ్‌అయ్యాయి. సన్‌ఫార్మా 4శాతం దిగజారి 423వద్ద కొనసాగింది. డాక్టర్‌ రెడ్డిస్‌ చివరిలో 30శాతంవరకూ క్షీణించి 1872.95వద్ద కొనసాగింది.

ఇక చమురుధరలు మూడునెలల గరిష్టానికి చేరాయి. బ్యారెల్‌కు 65 డాలర్లుగా కొనసాగాయి. వెనిజులాపై అమెరికా ఆంక్షలు, ఇరాన్‌పై ఆంక్షలు ఒపెక్‌ సరఫరా కుదింపు వంటి వాటితోధరలు పెరిగాయి. బ్రెంట్‌ముడిచమురుదరలు 65.10 డాలర్లకు చేరాయి. మొదటిసారిగా 65 డాలర్ల మార్కుకుచేరాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌షేర్లు పదిశాతం దిగువన ముగిసాయి.

అంతకుముందు పతనం నుంచి కొంతమేర రికవరీ అయ్యాయి. 242.85కి చేరాయి. ప్రస్తుతం షేర్లు ఆరుశాతంపెరిగి 238.35కి చేరాయి. ఇక డాలరుతో రూపాయి మారకం విలువలు 71.25గా కొనసాగింది. గురువారం 36 పైసలు క్షీణించి 71.16గాచేరిన డాలర్‌ మరింత క్షీణించింది. ముడిచమురుధరలు పెరగడంతో డాలర్‌ పటిష్టం కావడమే ఇందుకు కీలకం.

ఒఎన్‌జిసి షేర్లు మూడుశాతంపెరిగి 135కి చేరాయి. మూడోత్రైమాసికంలో ఆశించినస్థాయికంటేమెరుగైన ఫలితాలుప్రకటించడమే ఇందుకుకీలకం. 8263కోట్ల నికరలాభం ప్రకటించింది. కార్యకలాపాలనుంచి రాబడులు 27,694 కోట్లుగా ఉన్నాయి. రెవెన్యూ ఆఫ్‌షోర్‌ ఆపరేషన్లు 19.1శాతంమేరపెరిగినట్లుప్రకటించింది.





Untitled Document
Advertisements