కోకోకోలా కంపెనీలో ఘరానా మోసం...120 మిలియన్‌ డాలర్ల విలువైన సమాచారం చోరీ

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 06:19 PM

కోకోకోలా కంపెనీలో ఘరానా మోసం...120 మిలియన్‌ డాలర్ల విలువైన సమాచారం చోరీ

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 15: కోకోకోలా కంపెనీలో తాజాగా ఘరానా మోసం బయటపడింది. ఆ సంస్థకు చెందిన మాజీ సీనియర్‌ ఇంజనీర్‌ ఒకరు దాదాపు 120 మిలియన్‌ డాలర్ల విలువైన రహస్య సమాచారాన్ని చైనా కంపెనీ కోసం చోరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ చోరి గురించి టెన్నెసీలో ఆయన్ను ప్రశ్నించిన అధికారులకు మొత్తం వివరాలు తెలిసాయి.

అమెరికా జస్టిస్‌ డిపార్టుమెంట్‌ చేసిన ప్రకటనలో ఈ ఉద్యోగి చైనా కంపెనీ కోసం చోరీ చేసినట్లు చెపుతున్నారు. అమెరికా జాతీయుడు యుగ్జియా రాంగ్‌ టెక్నాలజీకి చెందిన విలువైన సమాచారం బిపిఎ ఫ్రీ ప్యాకేజింగ్‌ వ్యవస్థను దేశంలో అనేక కంపెనీలు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరించాడు. అట్లాంటా కేంద్రంగా ఉన్న ఒక వ్యవస్తపకుని పేరు కూడా ఇందులో ఉంది.

కోకోకోలాకు చెందిన మహిళా ప్రతినిధి ఈ సంఘటనపై వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు. న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్నందున ఇప్పుడేం మాట్లాడలేమని కొట్టివేసారు. చైనా జాతీయుడు ల్యూగ్జియాంగ్‌ చెన్‌తో కలిసి ఫుడ్‌ప్యాకింగ్‌ కోటింగ్‌కు సంబంధించిన ఫార్ములేషన్‌లను తస్కరించారు. ఫుడ్‌ప్యాకేజింగ్‌ రంగంలో ఈ బిపిఎ వ్యవస్థలు అత్యంత కీలకమైనవిగా భావిస్తారు.

ల్యూ ఈ టెక్నాలజీని తన కంపెనీకోసం వాడాలని ముందుగానే పథక రచన చేసి బిపిఎ ఫ్రీప్యాకింగ్‌ను తస్కరించినట్లు సమాచారం. ప్రతిగా ఆతనికి ఒక పెద్ద ఉద్యోగం హామీ ఇచ్చారు. అంతేకాకుండా చైనాలోనే పరిశోధన అభివృద్ధికి సంబంధించి అత్యున్నత స్థాయి అవార్డును సైతం ఇస్తామని వెల్లడించారు. అమెరికా ఇంటిలిజెన్స్‌ అధికారుల సమాచారం ప్రకారం చూస్తే ఖచ్చితంగా కోకోకోలా టెక్నాలజీని చైనా కంపెనీ కోసం తస్కరించినదిగానే నిర్ధారించారు.

ట్రేడ్‌ సీక్రెట్స్‌ బదిలీ చేయడం ద్వారా 100 మిలియన్‌ డాలర్లకు పైబడి విలువైన సమాచారం చోరీ చేసినట్లు తేల్చారు. అమెరికా కంపెనీలతో పోటీపడేందుకు వీలుగా ట్రేడ్‌ సీక్రెట్స్‌ను తస్కరించి తద్వారా లబ్దిపొందేందుకు చైనా కంపెనీ కృషిచేస్తోందని టెన్నెసీ జిల్లాలోని అమెరికా అటార్నీ వెల్లడించారు. అయితే చైనా ఈ విధానం అనుసరించడం వల్ల అమెరికా నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. అమెరికా మేధోసంపత్తి హక్కుల తస్కరణను తీవ్రంగా పరిగణించి కోర్టుకు హాజరుపరిచింది.





Untitled Document
Advertisements