ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు...!

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 06:31 PM

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు...!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: శుక్రవారం బులియన్‌ మార్కెట్లలో ఆభరణాల వ్యాపారులు కొనుగోళ్లు పెంచడంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. విదేశ ఈమార్కెట్లు కలిసి రావడం వల్లే ఇలా పెరిగాయి అని అఖిల భారత సరాఫా అసోసియేషన్‌ వెల్లడించింది. అదే తీరులో వెండిధరలు కూడా నడిచాయి. ఇక ధరల విషయానికొస్తే బంగారం పదిగ్రాములు రూ.310 రూపాయలు పెరిగి రూ. 34,310కి చేరింది.

వెండిధరలు కూడా కిలో ఒక్కింటికి రూ.170 పెరిగి రూ.40,820కి చేరింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీ యూనిట్లు కొనుగోళ్లు పెంచడంతో వెండి దరలు సైతం పెరిగాయి. బులియన్‌ ట్రేడర్లు మాట్లాడుతూ దేశీయ మార్కెట్‌ లో కొనుగోళ్ల వాతావరణం బలపడిందని చెపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోకూడా వెండిబంగారం ధరలు 0.14 శాతంపెరిగింది.ఔన్స్‌ ఒక్కింటికి 1315.20గా నిలిచింది.

అమెరికాలో రిటైల్‌ గణాంకాలునీరసించడం, తాజాగా అంతర్జాతీయ మందగమనంపై అనిశ్చితి ఆందోళన వ్యక్తం కావడంతో ధరలు కొంత దేశీయ మార్కెట్‌కు ఊతం ఇచ్చాయి. వెండిదరలు సైతం రూ.10 తగ్గి ఔన్స్‌ఒక్కింటికి 15.67గా నిలిచాయి.దేశరాజధాని పరిసర మార్కెట్లలో 99.9 కేరట్లు, 99.5 కేరట్ల స్వఛ్ఛమైన బంగారం పదిగ్రాములురూ.310 పెరిగి రూ.34,310కి చేరింది. 34,160గా కూడా 22కేరట లబంగారం నిలిచింది.

అంతకుముందు నాలుగురోజుల్లో బంగారం రూ.280లు తగ్గింది. సవర్లలోచూస్తే ఎనిమిది గ్రాముల బంగారం రూ.26వేలకు చేరింది. బంగారంతోపాటే వెండి దరలు కూడా రూ.170కి రికవరీ అయి కిలో ఒక్కింటికి 40,820 రూపాయలుగా మారింది. వారం వారం పంపిణీకింద రూ.94పెరిగి రూ.39,584కి చేరింది. వెండినాణేల పరంగా చూస్తే ప్రతి వంద నాణేల కొనుగోలుకు 80వేలు, అమ్మకాలకు 81 వేలుగా నడిచింది.





Untitled Document
Advertisements