డిఫరెంట్ సబ్జెక్ట్ తో కళ్యాణ్ రామ్ '118' ట్రైలర్...

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 06:42 PM

డిఫరెంట్ సబ్జెక్ట్ తో కళ్యాణ్ రామ్ '118' ట్రైలర్...

హైదరాబాద్ ఫిబ్రవరి 15: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా షాలిని పాండే, నివేదా థామస్ హీరోయిన్లుగా వస్తున్న సినిమా '118'. పటాస్ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ కు ఒక్కటి కూడా సరైన హిట్ రాలేదు. కేవీ గూహన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి తాజాగా ఓ ట్రైలర్ ను విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తుంటే కళ్యాణ్ హిట్ కొట్టేలా కనిపిస్తుంది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. మార్చి 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ పై ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.





Untitled Document
Advertisements