జవాన్లపై దాడి విషయంలో చైనాకు ఎందుకీ మౌనం?

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 06:54 PM

జవాన్లపై దాడి విషయంలో చైనాకు ఎందుకీ మౌనం?

చైనా, ఫిబ్రవరి 15: గురువారం సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 49 మంది సైనుకులు అమర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఇక ఈ దాడిని ఖండిస్తూ దాదాపు ప్రప్రంచ అన్ని దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. కాని చైనా మాత్రం ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. కనీసం దాడిని ఖండించనూ లేదు.

జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనకు కూడా చైనా ఎప్పటి నుంచో అడ్డుపడుతున్నది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా తప్ప మిగతా దేశాలన్నీ ఈ ప్రతిపాదనకు అంగీకరించినా చైనా మాత్రం తన వీటో పవర్‌తో అడ్డుకుంటున్నది.





Untitled Document
Advertisements