ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించిన రష్యా

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 07:17 PM

ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించిన రష్యా

రష్యా, ఫిబ్రవరి 15: నిన్న జవాన్లపై పాక్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 49 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. ఇక దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఖండించారు. దాడికి పాల్పడ్డవారు, సహకరించిన వారికి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందేనన్నారు. రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదిలతో ఫోనులో మాట్లాడారు.

అనంతరం విడుదల చేసిన సందేశంలో ఈ అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఫుతిన్‌ తెలిపారు. కౌంటర్‌ టెర్రరిజంను మరింత బలపరిచే దిశగా మిత్ర దేశం భారత్‌తో కలిసి పని చేస్తామని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత ప్రజల ఆవేదనను పంచుకుంటున్నామని..క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.





Untitled Document
Advertisements