దాదాపు వందేళ్ళ తరువాత దర్శనమిచ్చిన బ్లాక్ పాంథర్

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 08:14 PM

దాదాపు వందేళ్ళ తరువాత దర్శనమిచ్చిన బ్లాక్ పాంథర్

నైరోబి, ఫిబ్రవరి 15: ఆఫ్రికా దేశం కెన్యాలోని శాన్‌డీగో జులో అమర్చిన సీక్రెట్‌ కెమెరాలకు దాదాపు వందేళ్ళ తరువాత ఓ అరుదైన నల్ల చిరుత చిక్కిది. ఈ కెమెరా అందించిన ఫొటోలతో బ్లాక్ పాంథర్ ఉందని అటు శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. లోసయిబా వైల్డ్‌లైఫ్ కన్జర్వేటరీలో కొన్నాళ్లుగా పలువురు రీసెర్చర్లు చిరుతలపై అధ్యయనం చేస్తున్నారు.

అందులో భాగంగా పలు చోట్ల కెమెరాలు అమర్చగా.. వాటికి ఈ నల్ల చిరుత చిక్కింది. బ్లాక్ పాంథర్స్‌గా పిలిచే ఈ అత్యంత అరుదైన చిరుత కనిపించడం తమకు చాలా ఉత్సాహంగా అనిపించిందని కన్జర్వెన్సీ వెబ్‌సైట్ చెప్పింది.

వీటినే మెలానిస్టిక్ లెపార్డ్స్‌గా కూడా పిలుస్తారు. మెలానిజం అనేది ఓ జన్యుపరమైన ఉత్పరివర్తనం. శరీరంలో అధికంగా మెలానిన్ ఉత్పత్తి కావడం వల్ల శరీర కణజాలం నల్లబడుతుంది. అది కాస్తా చర్మం నల్లగా మారడానికి కారణమవుతుంది. ఈ తాజా పరిశోధనతో ఆఫ్రికాలో నల్ల చిరుత ఉందని గత వందేళ్లలో తొలిసారి శాస్త్రీయ నిరూపణ జరిగింది.





Untitled Document
Advertisements