బలవంతంగా పెళ్లి చేసినందుకు భజరంగ్ దళ్ కార్యకర్తలు అరెస్ట్....

     Written by : smtv Desk | Fri, Feb 15, 2019, 08:31 PM

బలవంతంగా పెళ్లి చేసినందుకు భజరంగ్ దళ్ కార్యకర్తలు అరెస్ట్....

హైదరాబాద్, ఫిబ్రవరి 15: గురువారం ప్రేమికుల రోజు సందర్భంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు ఓ జంటకు బలవంతంగా పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఆ వీడియో ను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు.

ఇక ఈ ఘటన పై యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం పెళ్లి చేసిన శ్రీహరిచారి, ఆనంద్, అవినాష్, ఆశోక్, సురేష్ కుమార్, చంద్ర శేఖర్‌లను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

బలవంతపు పెళ్లి ఘటనలో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఆరుగురిని అరెస్ట్ చేసినట్టుగా బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు. తన కూతురు కాలేజీకి వెళ్లిన సమయంలో దూరపు బంధువు రాకేష్ అక్కడికి రావడంతో ఇద్దరు కలిసి పార్క్‌కు వెళ్లగా బలవంతంగా పెళ్లి చేశారని బాలిక తండ్రి పోలీసులకు వివరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు డీసీపీ పద్మజ చెప్పారు.





Untitled Document
Advertisements