ఉగ్ర దాడి ఘటనపై పంజాబ్ మంత్రి సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు!

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 08:30 AM

ఉగ్ర దాడి ఘటనపై పంజాబ్ మంత్రి సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు!

శ్రీనగర్, ఫిబ్రవరి 16: జమ్ము కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్ర దాడుల ఘాతుకంపై దేశ వ్యాప్తంగా ఖండనలు వెలువడుతున్నాయి. ఇలాంటి తరుణంలో పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన సిద్ధూ, ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఉగ్రవాదుల దాడి ఓ పిరికిపంద చర్యగా అభివర్ణించారు.

అయితే, కొంతమంది చేసిన తప్పుకు దేశం మొత్తాన్ని నిందించడం తగదంటూ ఆయన పాకిస్థాన్ ను వెనకేసుకొస్తున్న తీరు కలకలం రేపుతోంది. కాగా, గతంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ ను సిద్ధూ కౌగిలించుకోవడం వివాదాస్పదమైంది.





Untitled Document
Advertisements