అదో పెద్ద డ్రామా కంపెనీ: మంత్రి నారా లోకేష్

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 10:12 AM

అదో పెద్ద డ్రామా కంపెనీ: మంత్రి నారా లోకేష్

కృష్ణా, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని పొన్నవరం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ...రాష్ట్రంలో వైసీపీ అద్భుతమైన డ్రామా కంపెనీలా మారిందని విమర్శించారు.

"రాష్ట్రంలో దొంగ అయిన జగన్‌ రాజకీయ డ్రామాలకు తెరతీసి, రోజుకొక వేషంతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. కోడికత్తి వ్యవహారానికి ఢిల్లీలో స్ర్కిప్టు తయారు చేస్తే, వైజాగ్‌లో సీన్‌ క్రియేట్‌చేసి ప్రజలలో సానుభూతి పొందాలని చూసారు. కత్తితో పొడిచింది ఆ పార్టీ కార్యకర్తే అనే విషయం ప్రజలకు తెలుసు. ఎన్ని ఫెడరల్‌ ఫ్రంట్‌లు ఏర్పడినా మోదీ మళ్లీ ప్రధాని కావటం అసాధ్యం.

సంక్షేమం కోసం రోజుకు 20 గంటలపాటు కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు మాత్రమే. రాష్ట్రంలో సైకిల్‌ గాలి ఆపటం ఎవరి తరం కాదు. ప్రస్తుతం టీడీపీలో ఉండి వేరే పార్టీలో చేరుతున్న వ్యక్తులకు ఇక్కడ సీట్లు రావనే విషయాన్ని గమనించి వెళ్తున్నారు తప్ప మరేమీ లేదు" అని లోకేష్ అన్నారు.

ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో నకు పోటీ చేయాలని ఉందని తెలిప్పారు నేను పోటీ చేయాలా వద్దా అనేది తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని అన్నారు. అంతేకాకుండా టీడీపీని వీడిన ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్ లను దృష్టిలో పెట్టుకుని లోకేష్ విమర్శలు చేశారు. జగన్ ను దూషించిన వారే ఆ పార్టీలో చేరడం విచిత్రంగా ఉందని అన్నారు.





Untitled Document
Advertisements