పుల్వామా దాడి: నేడే కేంద్రం అఖిలపక్ష భేటీ

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 11:11 AM

పుల్వామా దాడి: నేడే కేంద్రం అఖిలపక్ష భేటీ

న్యూడిల్లీ, ఫిబ్రవరి 16: పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై పాక్ ప్రేరేపిత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడికి సంబంధించి నిన్న కేంద్రం కేబినేట్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ దాడిపై వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది.

పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు అభిప్రాయ సేకరణ కోసం హోం శాఖ ఈరోజు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉదయం 11.30 గంటలకు భేటీ నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొననున్నారు.

పాక్ పై ప్రతీకారంలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై రాజకీయ పక్షాల నుంచి సలహాలు, సూచనలను కేంద్రం స్వీకరించనుంది. ఈ సందర్భంగా దేశాలో ఉగ్రవాద దాడులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను హోం మాత్రి రాజ్ నాథ్ సింగ్ నేతలకు వివరించనున్నారు.

ఈ చర్యలను అడ్డుకోవడంలో భారత్ తదుపరి వ్యుహలపై కూడా చర్చించనున్నారు. మరోవైపు భారత్ పాక్ సరిహద్దులో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి 150 యుద్ధ విమానాలను వాయుసేన సిద్ధంగా ఉంచింది.





Untitled Document
Advertisements