హోటల్ బిల్లు చూసి షాక్ అయిన రకుల్

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 12:44 PM

హోటల్ బిల్లు చూసి షాక్ అయిన రకుల్

హైదరాబాద్, ఫిబ్రవరి 16: సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ఒక రేంజ్ లో ఉంటుంది. వారు తిరిగే కార్లు, హోటళ్ళు అన్నీ ఖరీదైనవే ఉంటాయి. అయితే వారి విలాసాలకు అయ్యే ఖర్చు కూడా వారికీ పెద్ద విషయం కాదు. కానీ ఒక్కోసారి ఖర్చు విషయంలో వారు కూడా షాక్ కి గురవుతారని రకుల్ ప్రీత్ సింగ్ నిరూపించింది. దీనికి సంబంధించిన ఒక సంఘటన గురించి రకుల్ ఇంటర్వ్యూ లో చెప్పింది.

ఇటీవల రకుల్ తన స్నేహితులతో కలిసి లండన్ లో ఒక స్టార్ హోటల్లో విందుకు వెళ్లిందట. అక్కడ సరదాగా స్నేహితులతో కలిసి విందు చేసిందట. విందు తర్వాత హోటల్ వారిచ్చిన బిల్లు చూసి రకుల్ కి కళ్ళు తిరిగినంత పని అయ్యిందంట. మొత్తం పది మంది విందుకు ఆ హోటల్ వారు 10 లక్షల బిల్ వేసారట.

స్టార్ హోటళ్ళలో విందు రకుల్ కి కొత్తేం కాదు. కానీ ఈ స్థాయి ధరలను తను ఎక్కడ చూడలేదని, పడి మందికి హోటల్ వాళ్ళు వేసిన బిల్లు తనకి ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆమె చెప్పారు. జీవితంలో మళ్లీ ఆ హోటల్‌కు వెళ్లకూడదని రాకుల్ నిర్ణయించుకుందట.





Untitled Document
Advertisements