ఆఫర్ ఎఫెక్ట్: షాపింగ్ మాల్ లో తొక్కిసలాట..."పది రూపాయలకే చీర"

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 02:27 PM

ఆఫర్ ఎఫెక్ట్: షాపింగ్ మాల్ లో తొక్కిసలాట...

సిద్ధిపేట, ఫిబ్రవరి 16: సిద్ధిపేట లోని ఓ షాపింగ్ మాల్ లో ఈ రోజు ప్రమాదం చోటు చేసుకుంది. చీరలు కొనేందుకు వచ్చి తోపులాటలో గాయాలపాలైన మహిళలు. వివరాల ప్రకారం సిద్దిపేట లోని ఓ షాపింగ్ మాల్ మహిళలను ఆకట్టుకునేల పది రూపాయలకే చీర అనే ఆఫర్ ను ప్రకటించారు.

అయితే పెద్ద సంఖ్యలో చీరలు కొనేందుకు షాపింగ్ మాల్ కు వచ్చిన మహిళలు, మాల్ సెక్యూరిటీ గార్డ్ ఒక్కసారిగా గేట్లు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తోపులాటలో అనేక మంది మహిళలు గాయపడ్డారు. అంతేకాక మరో కొంత మంది తమ ఫోన్లను కూడా పోగొట్టుకున్నారు.

ఈ తోపులాటలో షాపింగ్ మాల్ సెక్యూరిటీ సిబ్బంది కంట్రోల్ చేయనంతగా మహిళలు గుమిగూడారు. అంతేకాక సెక్యూరిటీ గార్డ్ ల సంఖ్య తక్కువగా ఉండడంతో ఈ తోపులాట జరిగిందని అంటున్నారు అక్కడి ప్రజలు. మహిళలు ఈ ఆఫర్ కు ఆశపడి ముందుగా షాపింగ్ మాల్ లోకి వెళ్లి ఎక్కువగా చీరలు కొనే ఉద్దేశ్యంతో వెళ్ళడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది.





Untitled Document
Advertisements