అదే మ్యాచ్ రిషబ్ పంత్ ను వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికను నిర్ణయించేది....!

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 04:02 PM

అదే మ్యాచ్ రిషబ్ పంత్ ను వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికను నిర్ణయించేది....!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే, టీ20 సీరిస్ ల కోసం టీం ఇండియా ఆటగాళ్ళ పేర్లను శుక్రవారం బిసిసిఐ ప్రకటించింది. ఈ జట్ల ఎంపికలో టీ20 జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ప్రకటించి వన్డే జట్టులో మాత్రం భారత సెలెక్షన్ కమిటీ కొన్ని మార్పులు చేసింది. ప్రధానంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సీరిస్ లో వన్డే జట్టులో ధినేశ్ కార్తిక్ ను ఆడించగా స్వదేశంలొ జరుగుతున్న ఆస్ట్రేలియా వన్డే సీరిస్ కు మాత్రం అతన్ని దూరం పెట్టింది.

అతడి స్థానంలో యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి అవకాశం కల్పించారు. రిషబ్ పంత్ ఎంపిక గురించి భారత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దినేశ్ కార్తిక్ కు ఇప్పటివరకు జరిగిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లలో ఆడించామని గుర్తుచేశారు. ఆ సమయంలో పంత్ కి దాదాపు 20 రోజుల పాటు విశ్రాంతినిచ్చాం.

ఆ తర్వాత పంత్ ఇంగ్లాండ్ లయన్స్ పై చక్కటి ఆటతీరు కనబర్చాడన్నారు. అందువల్ల న్యూజిలాండ్ తో జరిగిన టీ20లో ఆడించామని ఎమ్మెస్కే తెలిపారు. అయితే వరల్డ్ కప్ కు ముందు మరోసారి పంత్ ని పరీక్షించాలని భావించామని అందుకోసమే స్వదేశంలో జరుగుతున్న వన్డే సీరిస్ కు ఎంపిక చేసినట్లు ఎమ్మెస్కే వెల్లడించారు. వరల్డ్ కప్ జట్టు తుది ఎంపికకు ముందు పంత్ ని కొన్ని వన్డే మ్యాచులు ఆడించి దాని ఆధారంగా ప్రపంచ కప్ ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇలా దినేశ్ కార్తిక్ కు కూడా ప్రపంచ కప్ జట్టులో ఎంపికయ్యే అవకాశాలింకా వున్నాయంటూ ఎమ్మెస్కే చెప్పకనే చెప్పారు. ఇక న్యూజిలాండ్ పర్యటనలో మరో యువ ఆటగాడు విజయ్ శంకర్ కూడా చక్కగా రాణించాడని ప్రశంసించాడు. అందువల్లే ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్ కు ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఈ సీరిస్ లో అతడు ఎలా ఆడతాడో చూడాలన్నారు. ప్రపంచ కప్ మెగా టోర్నీకి ముందు ప్రతి ఒక్కరిని పరీక్షించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. వరల్డ్‌ కప్‌ కోసం ఇప్పటికే 18 మంది ఆటగాళ్లతో షార్ట్‌ లిస్ట్‌ రెడీ చేసినట్లు ఎమ్మెస్కే వెల్లడించారు.





Untitled Document
Advertisements