పాకిస్తాన్ ప్రభుత్వంను హెచ్చరించిన అమెరికా

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 05:10 PM

పాకిస్తాన్ ప్రభుత్వంను హెచ్చరించిన అమెరికా

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 16: పాకిస్తాన్ ప్రభుత్వం ఇక నుండి ఉగ్రవాదులకు నిధులు అందించడం, నివాసం కల్పించడం వంటి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని అగ్రరాజ్యమైన అమెరికా శ్వేతసౌధం ఒత్తిడిచేసింది. ఉగ్ర గ్రూపులకు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్‌వైఖరిని వెంటనేమార్చుకోవాలని సూచించింది.

భారత్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని శ్వేతసౌధం తీవ్రంగా పరిగణించింది పాకిస్తాన్‌ కేంద్రంగా ఉన్న జైషేముహ్మద్‌ ఈ దాడికి తమదే బాధ్యత అని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా వెల్లువెత్తుతున్ననిరసనను దృష్టిలో పెట్టుకుని శ్వేతసౌధం వెంటనే ఈ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరింది.

అన్ని ఉగ్రగ్రూపులు పాక్‌ కేంద్రం గానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వాటి లక్ష్యం మొత్తం విధ్వంసం సృష్టించడం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమేనని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి సారా శాండర్స్‌ వెల్లడించారు.

ఈ దాడులు ఉగ్రవాదాన్ని తుముట్టించాలన్న ఐక్యకాకార్యాచరణకు మరింత బలాన్ని చేకూరుస్తున్నదని పేర్కొన్నారు. భారత్‌ అమెరికాలమధ్య ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు లక్ష్యాన్ని మరింత పటిష్టంచేస్తోందని శ్వేతసౌధం వెల్లడించింది.





Untitled Document
Advertisements