వాట్సప్ కొత్త ఫీచర్...ఇక గ్రూప్స్ తో గొడవే ఉండదు

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 06:46 PM

వాట్సప్ కొత్త ఫీచర్...ఇక గ్రూప్స్ తో గొడవే ఉండదు

ఫిబ్రవరి 16: సోషల్ మీడియాల్లో టాప్ లో ఉన్న సంస్థల్లో వాట్సప్ ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ అందిస్తూ అందరినీ ఆకట్టుకొంటున్న వాట్సాప్‌ త్వరలో మరో సరికొత్త ఫీచర్‌తో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మన ఫోన్ నెంబరు ఎవరికైనా తెలిస్తే చాలు మన అనుమతి, ప్రమేయం లేకుండానే మనల్ని ఏదో ఓ గ్రూపులో సభ్యుడిగా చేర్చేస్తుంటారు.

ఆ తరువాత ఆ గ్రూపు నుంచి వరుసగా మెసేజులు లేదా వాట్సాప్‌ కాల్స్ వస్తుండటం ఇబ్బందికరంగానే ఉంటుంది. బాగా తెలిసినవారైతే పరువాలేదు కానీ కొన్నిసార్లు అపరిచితుల నుంచి కూడా ఫోన్ కాల్స్, మెసేజులు వస్తుండటమే ఇబ్బందికరంగా ఉంటుంది.

ఒకవేళ పొరపాటున మన ఫోన్ నెంబరు నేరస్తులు, సంఘ విద్రోహశక్తులు లేదా ఉగ్రవాదుల చేతికో చిక్కితే మన ప్రమేయం లేకుండానే మన పేరును వారి గ్రూపులో చేర్చితే ఏమవుతుందో ఊహించుకోవచ్చు. ఈ సమస్యలను గుర్తించిన వాట్సాప్‌ సంస్థ, మన అనుమతి లేనిదే ఎవరూ మనల్ని ఏ గ్రూపులో చేర్చకుండా నిషేదించే ఒక ఫీచర్‌ను అందించబోతోంది. ప్రస్తుతం దానిని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూస్తోంది. దానిలో ఏమైనా లోపాలున్నట్లయితే సరిదిద్ది త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురాబోతోంది.

Update Features:

Nobody option : దీనిని ఎంచుకొన్నట్లయితే ఎవరూ మనల్ని ఏ గ్రూపులోనూ చేర్చలేరు.

My Contacts : దీనిని ఎంచుకొన్నట్లయితే, మన కాంటాక్స్ లో ఉన్నవారు మాత్రమే మనల్ని వారి గ్రూపులో చేర్చగలుగుతారు.

Everyone : దీనిని ఎంచుకొన్నట్లయితే, ఇప్పటిలాగే మనకు పరిచయం లేనివారు కూడా మనల్ని ఏదైనా గ్రూపులో చేర్చగలుగుతారు.

కనుక ‘Nobody’ లేదా ‘My Contacts’ అనే ఆప్షన్స్ లో ఏదో ఒకటి ఎంచుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.





Untitled Document
Advertisements